రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై బాధితురాలు తాజాగా విడుదల చేసిన వీడియోలో పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొనడంపై బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్‌ను నిలదీస్తున్నారు. పార్టీకి, పవన్ కల్యాణ్‌కు ఉన్న విలువ ఇదేనా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీ అరవ శ్రీధర్‌కు పవన్ అంటే లెక్కలేదా? లేకుంటే ఇంటర్నల్‌గా ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా అని నిలదీశారు. శ్రీధర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్, జనసేన పార్టీ చెప్పినా పట్టించుకోడు అని అనుకోవాల్సి ఉంటుంది అని బాధితురాలు హెచ్చరించారు.

