
భారతీయ రైల్వేలు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. AC కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు సాంప్రదాయ కళను దగ్గరగా అనుభవించే అవకాశం కల్పించారు. ఈ కొత్త ప్రయత్నంలో, రాజస్థాన్‌లో ప్రసిద్ధమైన సంగనేరి ప్రింట్లతో అలంకరించబడిన దుప్పటి కవర్లను అందించటం ప్రారంభించారు. ఈ కవర్లు రైలులోని ఏసీ బోగీల్లోని ప్రయాణికులకు పరిశుభ్రత, నాణ్యత, అలాగే భారతీయ వస్త్ర కళను సమీకరిస్తాయి. ఈ ప్రాజెక్ట్ మొదటగా జైపూర్‌లోని ఖతిపుర రైల్వే స్టేషన్లో పైలట్‌గా ప్రారంభించబడింది. విజయవంతమైతే, దేశవ్యాప్తంగా విస్తరించే యోచన ఉంది.