కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

