
గాజాలో గత రెండేండ్లుగా సాగుతున్న యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తొలి దశ శాంతి ఒప్పందంలో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో ఖాన్ యూనస్ నుంచి వారిని ఇజ్రాయెల్ తీసుకెళ్లింది.