గెలుపోటములు తాత్కాలికం.. ప్రజల గుండెల్లో మాజీ సిఎం కెసిఆర్ శాశ్వతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ భవన్ లో నూతన సంవత్సర
వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. యూరియా కోసం రైతులు చలికి వణుకుతూ క్యూలైన్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఒక్కటై మనపై కత్తులు దూస్తున్నాయని, మనల్నితుదముట్టించేందుకు రెండు పార్టీలు యత్నిస్తున్నాయని విమర్శించారు.

