రాహుల్ గాంధీ .. శ్రీరాముడు చేసిన పనులనే చేస్తున్నారని..పీడితులకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడమే శ్రీరాముడి లక్ష్యమని పేర్కొన్న మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారనికి కారణం అవుతున్నాయి. వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. ఇది హిందూ ధర్మానికి జరిగిన అవమానంగా బీజేపీ అభివర్ణించింది. రాహుల్ గాంధీ అయోధ్య రామాలయాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదన్న ప్రశ్నకు సమాధానంగా పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు.

