మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కూతురికి “అన్వీరా దేవీ”, కుమారుడికి “శివరామ్” అనే పేర్లు పెట్టినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. అన్వీరా దేవీ అనే పేరుకు ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుందని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరులోని “శివ” పదాన్ని, రామ్ చరణ్ పేరులోని “రామ్” పదాన్ని కలిపి “శివరామ్”గా నామకరణం చేసినట్లు సమాచారం.

