రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మరణం సంభవించింది ఓ ఆరేళ్ల బాలుడు విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం సుమారుగా 315 మంది నుంచి శాంపిళ్లను సేకరించి. పరీక్షలకు పంపినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ వివరించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు.

