ఎఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇవాళ సోషల్ మీడియా ఖాతాలో జగన్ పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ తీరు మనందరిని సిగ్గుపడేలా చేసిందని మండిపడ్డారు. రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని, రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నా దేశాన్ని ఎవరూ కించపరచకూడదని తెలిపారు. ఇండియా కృత్రిమ మేధ ఇంఫాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్ 5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

