రష్యా లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. రష్యాలోని వివిధ ప్రాంతాలపై ఒకేసారి వెయ్యికి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల సెయింట్ పీటర్స్బర్గ్లోని ఒక చమురు ఎగుమతి టెర్మినల్ అగ్నిప్రమాదానికి గురైంది. రష్యాలోని 15 ప్రాంతాలతో పాటు, క్రిమియా మరియు నల్ల సముద్రంపై మొత్తం 1,015 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెయింట్ పీటర్స్బర్గ్లోని పెట్రోబర్గ్ ఆయిల్ టెర్మినల్, ‘రుచి’ ఆయిల్ డిపోల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.