బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలోని నైన్‌పూర్‌లో మైనర్లకు, బాలికలకు యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. యూనిఫాంలో వచ్చిన విద్యార్థినులు ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన ఆ దుకాణానికి వెళ్లి విచారణ జరిపారు. మైనర్లకు మద్యం అమ్మినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

