ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లొంగిపోవడం తప్ప ఇరాన్‌కు వేరే మార్గం లేదన్నారు. లొంగిపోయిన తరువాత ఇరాన్‌తో చర్చల విషయం ఆలోచిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం తీసుకొస్తామని, నాయకత్వాన్ని మార్చిన తరువాత ఇరాన్‌ను సమర్ధవంతమైన దేశంగా మారుస్తామని ప్రకటించారు. ఇరాన్ భవిష్యత్ చాలా బాగుంటుందని, ఆదేశ గౌరవాన్ని తిరిగి కాపాడుతామని ట్రంప్ అన్నారు.

