ఢీ ఫేమ్ డ్యాన్సర్ పండు మాస్టర్ నాలుగు నెలల క్రితం విశాఖపట్నం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి క్రమ క్రమంగా కోలుకుంటోన్న పండు తాజా హెల్త్ కండీషన్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు యాక్సిడెంట్ తర్వాత తన రికవరీ జర్నీకి సంబంధించి ఒక వీడియోను యూట్యూబ్ లో షేర్ చేశాడీ డ్యాన్స్ మాస్టర్. అయితే ఇది చిన్న వీడియోనే అని, త్వరలోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయనున్నట్లు పండు మాస్టర్ వెల్లడించారు.

