ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లు, తమిళనాడులో రూ. 4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మోసం చేయడంలో డీఎంకే మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. తమిళనాడు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారని, డీఎంకే ప్రభుత్వం తమిళనాడును దోచుకుంటోందని రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తామని మధురై బహిరంగ సభలో ప్రధాని హామీ ఇచ్చారు.

