మెక్సికో సిటీలోని ఐకానిక్ Zócalo స్క్వేర్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌తో షకీరా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఉచిత ఈవెంట్‌కు సుమారు 4 లక్షల మందికి పైగా అభిమానులు హాజరైనట్లు స్థానిక గణాంకాలు చెబుతున్నాయి. జోకాల చరిత్రలో ఇంత భారీ జనసందోహం ఇదే తొలిసారి అని నివేదికలు వెల్లడించాయి. నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, రద్దీని నియంత్రించేందుకు సమీప ప్రాంతాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

