భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముంబయి వేదికగా కొత్త అధ్యాయం మొదలైంది. మంగళవారం ముంబయిలోని లోక్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భేటీ అయ్యారు. ఒక ఫ్రాన్స్ అధ్యక్షుడు ముంబయిని సందర్శించడం ఇదే తొలిసారి. చర్చలకు ముందు తాజ్ హోటల్ వద్ద 26/11 ముంబయి దాడుల అమరవీరులకు మెక్రాన్ దంపతులు నివాళులర్పించారు. ఏఐ (AI), స్టార్టప్ రంగాల్లో సహకారం కోసం “ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026″ను ఇరువురు నేతలు ప్రారంభించారు.

