ఇరాన్ పొరుగున ఉన్న యూఏఈ (UAE), ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై క్షిపణి వర్షం కురిపిస్తోంది. ఇరాన్ తీరుపై యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొరుగు దేశాలపై, సామాన్య ప్రజలపై దాడులు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ యుద్ధం పొరుగు దేశాలతో కాదు, శత్రువులతో తేల్చుకోండి. శాంతియుతంగా ఉన్న గల్ఫ్ దేశాలను ఈ రక్తపాతంలోకి లాగడం తగదు” అని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు.

