రేవంత్రెడ్డి సీఎం అయ్యింది ప్రజల ఆశీర్వాదంతో కాదు, పేమెంట్ కోటాలోనేనని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి భాషను విని తెలంగాణ ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టకుండా, మాజీ సీఎం కేసీఆర్ను తిడుతూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై విమర్శలు చేస్తుంటే ఒక కొడుకుగా తనకు ఆవేశం రాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

