ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఇతర భద్రతా కారణాలతో మాస్కోలో సోమవారం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాయాలను మూసివేశారు. మూసివేతకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాజధాని మాస్కో పరిధిలోకి వచ్చే డోమోడెడోవో, వినుకోవో, జుకోవ్‌స్కీ, షెరెమిటైవో ఎయిర్‌పోర్టులలో పూర్తి స్థాయి వైమానిక ప్రయాణ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నానికి 11 ఉక్రెయిన్ డ్రోన్లను వేర్వేరు ప్రాంతాలలో నేలకూల్చాయి. కొన్ని శత్రు డ్రోన్లు మాస్కో గగనతలం వైపు దూసుకువస్తున్నట్లు తెలియడంతోనే భద్రతా కారణాలతో విమానాశ్రాయాలలో రాకపోకలను తదుపరి ప్రకటన వెలువడే వరకూ నిలిపివేసినట్లు వెల్లడైంది.

