మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి, దేశవ్యాప్త విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

