మార్చి 31 లోగా దేశం నుంచి నక్సలిజాన్న నిర్మూలించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఆయన చెప్పారు. అక్కడ రాళ్లు రువ్వే ఘటనలు సున్నాకు పడిపోయినట్లు వెల్లడించారు. మణిపూర్‌లోనూ వర్గ హింసను ఆ దళాలు కట్టడి చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్లలో మావోయిస్టుల వెన్ను విరిచినట్లు సీఆర్పీఎఫ్‌ను మంత్రి షా కీర్తించారు.

