రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్‌పై నమోదైన క్రిమినల్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, శారీరకంగా వాడుకుని వదిలేశారని ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) జోక్యం చేసుకోవడంతో పోలీసులు వెంటనే కేసు ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(2), 318(4) (మోసం), 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు బనాయించారు.

