ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలో భాగంగా ఐసీసీ ట్రోఫీ టూర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ట్రోఫీ ముంబై నుంచి మొదలై, టోర్నమెంట్ హోస్ట్ నగరాలన్నింటినీ సందర్శిస్తుంది. ఢిల్లీతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లో అభిమానులకు ట్రోఫీని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.

