తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులకు ముగ్గురు పిల్లలు వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా ఇద్దరు విడిగా ఉంటున్నారు భార్యకు మరొకరితో వివాహేతర సంబంధంలో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్కడితో ఆగని బాలమురుగన్.. రక్తపు మడుగులో పడిఉన్న భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకుని ద్రోహానికి పరిహారం మరణం అని పేర్కొంటూ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. పోలీసులు వచ్చే వరకు అక్కడే కూర్చుండి పోయాడు.

