మహాత్మా గాంధీ మునిమనువరాలు ఆశిష్ లతా రామ్గోబిన్(56)కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది సౌతాఫ్రికా కోర్టు. ఇలా గాంధీ, దివంగత మెవా రామ్గోబిన్ల కుమార్తె అయిన లతా రామ్గోబిన్కు.. ఎస్ఆర్ మహరాజ్ అనే వ్యాపారవేత్తను 6 మిలియన్ రాండ్స్ (రూ. 3.22 కోట్లకు) మోసం చేసిన కేసులో ఈ శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో కోర్టు శిక్ష ఖరారు చేస్తూ.. అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది.

