మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో శుక్రవారం పూర్తి స్థాయిలో హర్తాళ్ జరిగింది. దీనితో సాదారణ జనజీవితం స్తంభించింది. కుకీ జో ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలో రెండు ఆదివాసీ సంస్థలు బంద్‌కు పిలుపు నిచ్చాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఇద్దరు ఈ ప్రాంతపు ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదానికి దారితీసింది. శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో నిరసనకారులు చేతుల్లో లాఠీలు పట్టుకుని జిల్లా ప్రదాన కేంద్రంలో వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు.విద్యా సంస్థలు, మార్కెట్లు మూతపడ్డాయి. తుయిబాంగ్ ప్రాంతంలో బంద్ ప్రబావం తీవ్రంగా కన్పించింది.

