రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభం కావడంతోనే సెన్సెక్స్ 1,800కి పైగా, నిఫ్టీ 550కి పైగా పాయింట్ల లాభాల్లోకి వెళ్లాయి. 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 73,780 స్థాయి వద్ద, నిఫ్టీ 22,890 స్థాయి వద్ద కదలాడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 94.70 వద్ద కొనసాగుతోంది.

