భారత వాయుసేన కొత్త చీఫ్గా అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. వాయుసేనలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న అశుతోష్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్తో పాటు ఇతర విమానాల ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. 1986లో అశుతోష్ దీక్షిత్ ఫైటర్ పైలట్గా వాయుసేనలో చేరారు. ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను 3వేల 500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఉంది.

