మరో ఐదు రోజుల్లో అండర్ 23 వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. అమెరికాలోని లాస్ వేగాస్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. అయితే, భారత రెజ్లర్లు పాల్గొనడంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. అందుక్కారణం వీసాలను తిరస్కరిస్తూ అమెరికా అధికారులు నిర్ణయం తీసుకోవడమే. తమ వయసు 20 ఏళ్ల కంటే తక్కువగా ఉండటంతోపాటు.. నిరుద్యోగులుగా పరిగణించడంతోనే వీసాలను తిరస్కరించడం జరిగిందని పలువురు రెజ్లర్లు వాపోయారు. బుధవారం వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు వారి పాస్‌పోర్ట్‌లను యూఎస్ ఎంబసీ ఇచ్చేసినట్లు తెలిపారు.