
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్ అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేసి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే అఫ్గాన్ మంత్రి
పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ నబి ఒమారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఎలాంటి ఆక్రమణకు పాల్పడ్డా.. అఫ్గాన్ దళాలు వారిని భారత సరిహద్దుల వరకూ పరిగెత్తిస్తాయని వ్యాఖ్యానించారు.