
మే 3న మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ టెస్ట్ రేంజ్ నుంచి స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి విమాన పరీక్షను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భవిష్యత్తులో భారతదేశం గాలి కంటే తేలికైన హై-ఆల్టిట్యూడ్ వ్యవస్థలను నిర్మించడానికి, ఈ ప్రోటోటైప్ ఫ్లైట్ ఒక మైలురాయి అని DRDO చైర్మన్ సమీర్ కామత్ అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీతో భారత సైనిక నిఘా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.