భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి కీలక పదవికి ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా రంగస్వామి ఎన్నికయ్యారు. ఢిల్లీ మాజీ ఓపెనర్ వెంకట్ సుందరం కార్యదర్శిగా .. దీపక్ జైన్ కోశాధికారిగా,జ్యోతి థాటే, సంతోష్ సుబ్రమణియన్లు ఐసీఏ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన రంగస్వామి భారత క్రికెట్లో దిగ్గజ ప్లేయర్. మహిళల జట్టుకు తొలి కెప్టెన్గా పేరొందిన ఆమె.. 1976 నుంచి 1991 మధ్య కాలంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు.

