1983 వరల్డ్ కప్ ప్లేయర్, ప్రస్తుత ఎంపీ కీర్తి ఆజాద్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి ఐసీసీ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. మిగతా దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు రకరకాల గ్రూపుల్లోకి మారుతుంటాయని, కానీ ఇండియా, పాక్ మాత్రం ఎప్పుడూ విడిపోకుండా ఒకే చోట ఎలా ఉంటున్నాయని నిలదీశారు. “ఇది ఐసీసీ, బీసీసీఐ కలిసి చేస్తున్న ఫిక్సింగ్ కాదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

