భారత్‌పై అమెరికా భారీ సుంకాల తర్వాత మరోసారి పిడుగు లాంటి వార్త . అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బి వర్కర్ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలన్న ఉత్తర్వులపై సంతకం చేసేశారు. ఇది భారతీయులపై పెద్ద ప్రభావం చూపుతుంది. వారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఇది 1500 డాలర్లు మాత్రమే ఉండేది. భారత్ పై ఇది అదనపు భారమే అని చెప్పాలి. ఎందుకంటే అత్యధికంగా హెచ్ 1 బి వీసా 71 శాతం భారత్‌కే గతంలో దక్కాయి.
విదేశీయులకు ఉద్యోగాలు ఇచ్చే బదులు స్థానిక యువతకు నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించాలని ట్రంపు పిలుపునిచ్చారు.

