భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ఆయన ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. అమెరికా ప్రాంతంలో భారత్‌కు బ్రెజిలే అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి అని ఆయన గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్ల మార్కును
సునాయాసంగా అధిగమిస్తుందన్న బలమైన విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

