ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అక్షర్, బుమ్రాలను జట్టు నుంచి తప్పించి వాళ్ల స్థానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లను జట్టులోకి తీసుకుంది.

