భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి తడబడింది. అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లోనే రీజా హెండ్రిక్స్‌ను అవుట్ చేయగా, విజయం కోసం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడి, ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చారు.

