బెంగళూరు శివార్లలోని హోస్కోట్-దబాస్‌పేట్ జాతీయ రహదారి (NH-648)పై శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా జరిగిన భీకర చైన్ కొలిజన్ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా దూసుకొచ్చిన ఒక XUV700 కారు ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు నియంత్రణ కోల్పోయి, ఎదురుగా వస్తున్న క్యాంటర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న మరో కారు కూడా వీటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

