నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు గా మారి కేసీఆర్‌ను కాపాడుతున్నారని, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీ నదిలో వేసినట్లేనని ఓటర్లను హెచ్చరించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో, పన్నెండేళ్ల మోదీ పాలనలో నిజామాబాద్ సమస్యలు పరిష్కారం కాకపోగా,చెత్తకుప్పగా మారిందని మండిపడ్డారు.

