తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభాపక్ష (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభమైంది.

