బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు నాలుగు మరణాలను ధృవీకరించారు. ఖరీక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగరీ వంతెన సమీపంలో నేషనల్ హైవే 31పై అతివేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు పికప్ వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా పలు వాహనాలు ఒకదానికి ఒకటి తాడకంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.

