
్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం ఎంఎల్ఎ బాలకృష్ణ ఇంటి ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాలంపల్లి గ్రామానికి చెందిన రైతుల బాలాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు.
వెంటనే పోలీసులు అప్రమత్తమై అతడిని స్థానిక పిఎస్ కు తరలించారు. బాలాంపల్లి గ్రామంలోని తన భూమిని ఎపిఐఐసి తీసుకుంటోందని రైతు ఆరోపణలు చేశారు. బాలకృష్ణ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసిన రైతును పోలీసులు మీడియాకు చూపలేదు.