బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీఎన్పీ చైర్‌పర్సన్ తారిక్ రెహమాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. “బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీని అఖండ విజయానికి నడిపించినందుకు తారిక్ రెహమాన్‌ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రధాని మోదీ తన పోస్ట్‌లో ఇంకా ఇలా రాశారు.. మన దేశాల సంబంధాన్ని బలోపేతం చేయడానికి , మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో తెలిపారు.

