చైనాకు చెందిన రిటైల్ పెట్టుబడిదారులు, పెద్ద సంస్థలు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్లే ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లలో జరుగుతున్న అస్థిరమైన ట్రేడింగ్ వల్లనే బంగారం ధరలు నియంత్రణ లేకుండా మారుతున్నాయని ఆయన విమర్శించారు. పసిడి ధరల్లో కనిపిస్తున్న ఈ తీవ్రమైన ఒడిదుడుకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. .

