మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్ చేరగా, రెండో సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా, చిరుజల్లులైనా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు.

