తిరుమల శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతను ఇందులో పరీక్షిస్తారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో లేబరేటరీని తీర్చిదిద్దారు. ఓ పుణ్యక్షేత్రంలో ఇంతటి భారీ ఫుడ్ ల్యాబ్‌ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు.

