కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ ఆర్టీఏ తనిఖీలు విస్తృతం చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి 361 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 40 బస్సులను సీజ్ చేశారు. నంద్యాల జిల్లాలో 66, ఎన్టీఆర్ జిల్లాలో 42, పల్నాడు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 25, అన్నమయ్య జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 8, ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు అయ్యాయి.

