టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసి ఐర్లాండ్ నటి సోఫీ షైన్‌ను గబ్బర్ పెళ్లాడాడు. వీళ్ల వివాహం ఫిబ్రవరి 21న జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యాడు. ధావన్ వివాహంలో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీతో ధావన్ 2021లో విడాకులు తీసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఒక కొడుకు (జొరావర్) ఉన్నాడు. అతడు ప్రస్తుతం ఆయేషాతోనే ఉంటున్నాడు.

