ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడు మనస్థాపం చెందాడు. ప్రేమికుల దినోత్సవం రోజున రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అతడ్ని హత్య చేసినట్లు యువకుడి కుటుంబం ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల అమన్ గిరి ఇంటర్ చదువుతున్నాడు. ఎన్డీఏ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఎన్డీయే కోచింగ్‌కు వస్తున్న యువతి అతడికి పరిచయమైంది. దీంతో ఎనిమిది నెలలుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.

