విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను 1886లో మెుదటి సారిగా ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త అయిన హెన్రిచ్ హెర్ట్జ్ కనిపెట్టారు. ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లిఎల్మో మార్కోనీ 1895 – 96 సంవత్సరం నాటికి రేడియో తరంగాలను శబ్ద తరంగాలుగా మార్చి ప్రసార మాధ్యమాలుగా వాడుకలోకి తీసుకు వచ్చారు. 1920 నవంబరు 2 న అమెరికాలోని పిట్స్‌బర్గ్ లో మెుట్టమెుదటి రేడియో ప్రసారం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారు అనే వార్తను పిట్స్‌బర్గ్ కేంద్రంగా ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది.

